తెలుగు లలితా కళాతోరణంపై పేరు మార్పుపై వెనక్కి తగ్గిన టిఎస్ఆర్

తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్ గాంధీ లలితా కళాతోరణంగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం, సిపిఐ వంటి ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆందోళనకు దిగాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. అయితే, అది ఢిల్లీ స్థాయిలో జరిగిన నిర్ణయమని, తాను ఏమీ చేయలేనని ఆయన చెప్పారు. ఆ స్థితిలో రాష్ట్రంలో పెల్లుబుకుతున్న నిరసనను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన పెద్దలు టి. సుబ్బిరామిరెడ్డికి సూచించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications