హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడు నోట మళ్లీ నగదు బదిలీ పథకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోట మళ్లీ నగదు బదిలీ పథకం మాట వినిపించింది. నగదు బదిలీ పథకంపై దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని ఆయన ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ఆయన మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ ద్వారా, హైదరాబాదు రింగ్ రోడ్డు ద్వారా కాంగ్రెసు ప్రభుత్వం దళారులకు, మధ్యవర్తులకు దోచి పెట్టిందని ఆయన విమర్శించారు. రంగారెడ్డి జిల్లాను కాంగ్రెసు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు.

మెక్రో ఫైనాన్స్ బాధితులను కూడా తాను పరామర్శిస్తానని ఆయన చెప్పారు. మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు జిల్లాలో ఐదారుగురు మృత్యువాత పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ గృహ కల్ప పథకం కోసం ప్రభుత్వం డబ్బులు వసూలు చేసిందని, చాలా వరకు నిర్మాణాలే జరగలేదని, జరిగిన నిర్మాణాలు కూడా ప్రమాణాల మేరకు లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోస్తాంధ్ర నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X