పోలవరంపై పర్యావరణ శాఖకు సమాధానమిస్తాం: సిఎం రోశయ్య

భారత్ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర చాలా గొప్పదని రోశయ్య అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఔన్నత్యాన్ని అందరూ గౌరవించాల్సి ఉందన్నారు. ఆమె మళ్లీ అధ్యక్షురాలిగా ఎన్నిక కావటం సంతోషకరమన్నారు. ఏఐసిసి సమావేశంలో కొన్ని నిర్ణాయాలు తీసుకుందని ఆ నిర్ణయాలు సైతం హర్షణీయమన్నారు.
వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. ముంపు ప్రాంతాలకు త్వరలో కేంద్రస్థాయి అధికారులు వచ్చి పర్యవేక్షిస్తారని చెప్పారు. వచ్చిన వారికి వరద ముంపుపై పూర్తి సమాచారాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications