సినిమాలను నేను అడ్డుకోలేదు, ఇక అడ్డుకోను: కల్వకుంట్ల కవిత

రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెరాస విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. మంత్రుల వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ బషీర్‌బాగ్ చౌరస్తాలో తెలంగాణ మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నరకాసురుని ఆకారంలో ఉన్న తెలంగాణ మంత్రుల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. కాంట్రాక్టుల కోసం, మంత్రి పదవిని కాపాడుకోవడానికి సీమాంధ్ర నాయకులకు, ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ విమర్శించారు. క్షమాపణ చెప్పకపోతే మంత్రులు పాల్గొనే కార్యక్రమాలు అడ్డుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications