టార్గెట్ చంద్రబాబు: రాజ్ న్యూస్ లో వరుస వ్యతిరేక కథనాలు

Raj News
హైదరాబాద్: తెలంగాణ ఛానల్ గా పేరొందిన రాజ్ న్యూస్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకొన్నట్టు ఉంది. ప్రతి నిత్యం చంద్రబాబునాయుడు, తెలుగు దేశానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తూ తెలంగాణలో పార్టీ పటిష్టతను దెబ్బ తీయాలని చూస్తోంది. ప్రత్యేక తెలంగాణకు ముఖ్యమంత్రి రోశయ్య, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాఘవులు వంటి వారు ఎందరో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రాజ్ న్యూస్ మాత్రం కేవలం చంద్రబాబునాయుడినే లక్ష్యంగా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. తెలంగాణకు చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులను కూడా విస్మరించటం లేదు. రోశయ్య, జగన్ల విషయంలో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ప్రసారం చేయటం గమనార్హం.

తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి వంటి వారు తాము తెలంగాణ వాదులమని తెలంగాణ కోసం అన్ని పార్టీలకంటే మాకే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రకటిస్తూ, బాబ్లీ, ఢిల్లీ యాత్రలు చేపట్టినప్పటికీ రాజ్ న్యూస్ మాత్రం వారి చేసినవన్నీ దొంగనాటకాలుగా ప్రసారం చేస్తూ పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగు దేశం చేపట్టిన ఢిల్లీ యాత్ర రాజకీయ కోణంలో చేసిందని చెప్పడానికి రాజ్ న్యూస్ యాత్రకు చంద్రబాబు అనుమతి ఉందా ఆని ప్రశ్నించింది. చంద్రబాబు అనుమతి ఉందంటే బాహాటంగా ప్రకటించమన్నది. అనుమతి గూర్చి టీడీపీ మాట్లాడక పోవటంతో కేవలం దొంగనాటకంగా కథనాలు ప్రసారం చేశారు.

ఇక నవంబర్ 1వ తారీఖున చంద్రబాబునాయుడు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేయడాన్ని రెండు రోజులుగా నిత్యం ప్రసారం చేస్తోంది. తెలుగు తల్లి విగ్రహానికి బాబు దండవేసి తాను సమైక్యవాదినని బాబు చెప్పకనే చెప్పాడని, నవంబర్ 1కి అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఏ మాత్రం సంబంధం లేకున్నా ఆయనకు దండవేయడం ఏమిటని ప్రశ్నించింది. అమరజీవికి దండ వేయడానికి మదరాసు నుండి ఆంధ్ర విడిపోయిన అక్టోబర్ 1గానీ, అమరజీవి జయంతి, వర్ధంతిగానీ కావని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఏ సందర్భంలో ఎలా వేయాలో తెలియటం లేదని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, ప్రజారాజ్యం, లోక్ సత్తా, సిపిఎం ఉండగా రాజ్ న్యూస్ కేవలం తెలుగు దేశాన్ని, చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ తెలంగాణ ఇవ్వాలంటే జాతీయ పార్టీలతో వైరుధ్యం ఉన్నప్పటికీ ఆ పార్టీపై కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ పార్టీలో తెలంగాణ కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ వారూ ఉన్నారు. ఇలాంటప్పుడు కాంగ్రెస్ ను ముట్టుకోవడం సాద్యం కాదు. ఇక తెలంగాణలో ప్రజారాజ్యం బలం పూజ్యం, లోక్ సత్తా తెలంగాణ లోక్ సత్తాగా మారి అధినేతతో విభేదిస్తున్నది. ఇక మిగిలింది తెలుగు దేశం. ఆ పార్టీకి తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ను తమవైపు తిప్పుకోవాలంటే చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ప్రచారం చేస్తేగానీ కుదరని రాజ్ న్యూస్ గ్రహించి బాబును టార్గెట్ గా చేసుకన్నదని, అందుకే బాబు పర్యటనలకు అడ్డుకోవడానికి రాజ్ న్యూస్ షాడో కెసిఆర్ తెరాస కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడని కూడా పలువురు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+