ఉప ముఖ్యమంత్రి పదవి కోసం నలుగురు మంత్రుల పోటీ?

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు. పిసిసి అధ్యక్షుడు తెలంగాణకు చెందిన నాయకుడు కావడంతో ఉప ముఖ్యమంత్రి పదవి తమ ప్రాంతానికి దక్కే అవకాశం ఉందని భావించి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. చాలా వ్యవహారాలను చక్కబెట్టడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పొన్నాల లక్ష్మయ్య చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి వివాదంలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తూ అధిష్టానం మనసును ఆకట్టుకునే ప్రయత్నం సాగిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన బిసి నాయకుడు కావడం వల్ల తనకు అవకాశం ఉందని మంత్రి దానం నాగేందర్ అనుకుంటున్నారు. తాను నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని, ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదని ఆయన బహిరంగంగానే అంటున్నారు.












Click it and Unblock the Notifications