బాబ్రీ కూల్చివేత సిగ్గుచేటు, తీర్పు మతవాదులకు చెంపపెట్టు: సోనియా

కాశ్మీర్ అల్లర్ల పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. కాశ్మీర్ లో శాంతి స్థాపనకు అన్ని గ్రూపులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్ స్థితి పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధి అత్యంత ప్రధానమైందని ఆమె అన్నారు. దేశ అంతర్గత భద్రతకు నక్సలైట్లు ముప్పుగా పరిణమించారని సోనియా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయిస్తామని ఆమె చెప్పారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదించడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. అభివృద్ధిలో గిరిజనులకు వాటా కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి కూడలిలో ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెసు ఒక్కటేనని చెప్పుకోగలమని ఆమె అన్నారు. పది రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని, పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ సదస్సుకు వేయి మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ఇరుక్కున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కామన్ వెల్త్ క్రీడల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సురేష్ కల్మాడీ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications