విశాఖపట్నం: విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో కొండచరియలు విరిగి పడి మహిళ మరణించింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాజువాకలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. బొళ్లకొండ నుంచి రాళ్లు పడుతున్నాయి. రాత్రి నిద్రలోనే కొండ చరియలు విరిగిపడి లక్ష్మి అనే మహిళ మరణించింది. రాళ్ల కింద మరికొంత మంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదస్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా కూలీలే నివాసం ఉంటారు.