నిజామాబాద్ తహసీల్దారు కార్యాలయంలో మంటలపై అనుమానాలు

ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేసినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం 6 గంటల సమయంలో జరగటంతో స్థానికులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంతకుముందు ఎన్నికల సమయంలో కూడా కీలక పత్రాలు ఉన్న గదిలోనే మంటలు రేగాయి. అప్పుడు కూడా ఇలాగే జరగటం గమనించదగ్గ విషయం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇంతకు ముందు ఈ కార్యాలయంలో ఆర్థిక కుంభకోణం చోటు చేసుకుంది. 70 లక్షల రూపాయలు డ్రా చేసిన సంఘటనలో దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలకు లెక్కలు తేలలేదు. ఈ అక్రమ వ్యవహారంలో డిప్యూటీ ఎమ్మార్వో సస్పెన్ష్ కు గురయ్యాడు.












Click it and Unblock the Notifications