దూసుకొస్తున్న జల్ తుఫాను: అల్లకల్లోలంగా సముద్రం

నెల్లూరు జిల్లాపై తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. కృష్ణపట్నం ఓడరేవు వద్ద పదో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో 9వ నెంబర్ ప్రమాదం హెచ్చరికను ఎగురవేశారు. విశాఖపట్నం, భీమునిపట్నం, కాకినాడ, గన్నవరం తదితర ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. సముద్రంలోకి వెళ్లకూడదని జాలర్లను హెచ్చరించారు. జల్ తాకిడికి నెల్లూరు జిల్లా తీవ్రంగా గురయ్యే ప్రమాదం ఉంది. తీర ప్రాంతంలోని గ్రామాల్లోకి నీరు చొచ్చుకుని వస్తోంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం సరిగా లేకపోవడంతో ఆదివారంనాటి ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటన రద్దయింది. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గతంలో పని చేసిన అనుభవం ఉన్న అధికారులను సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించడానికి ఆయన జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు. సహాయ చర్యల కోసం నెల్లూరు జిల్లాలో రెండు హెలికాప్టర్లను సిద్దంగా ఉంచారు.












Click it and Unblock the Notifications