చంద్రబాబూ! మే అమాయకులం కాదు: మంత్రి రఘవీరారెడ్డి

పంట నష్టపోయిన రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన జిల్లాలో వివిధ చోట్ల రైతులతో మాట్లాడారు. గ్రామ యూనిట్‌గా బీమా పథకాన్ని అమలు చేస్తామని, బీమా వర్తించని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు. వచ్చే రబీ పంట కాలానికి విత్తనాలు రాయితీ మీద అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇదిలాఉండగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకు మండలం దువ్వలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనా ఈ సమయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ సమన్వయంగా పనిచేయాలని అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చేసిన ప్రసంగాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, అటువంటి ధోరణిని విడనాడాలని మంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications