నా సహనం నశిస్తే ఉప్పెన పుడుతుంది: పార్టీపై జగన్ తిరుగుబాటు

కొండా సురేఖ, అంబటి రాంబాబు , కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఏం తప్పు చేశారని, వారు చేసిన తప్పేమిటని అడుగుతున్నానని, తనతో పాటు నడవడమేనా వారు చేసిన తప్పు అని, వారంతా పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారేనని, అది న్యాయమా అని ఆయన అన్నారు. కుళ్లు, కుతంత్రాలు పన్నినా చిరునవ్వుతో ఉన్నానంటే అది ప్రజల ఆప్యాయత, ప్రేమ అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను పక్కన పెడితే, ప్రతిపక్షాలు కొమ్ము కాస్తున్న ఆ రెండు పత్రికలను పక్కన పెడితే, సొంత పార్టీవారే కుళ్లు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనూ కుళ్లు, కుతంత్రాలు రాజ్యమేలుతున్నాయని ఆయన అన్నారు. మరణించిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డిపై బురదజల్లే కుళ్లు, కుతంత్రాలు రాజకీయాల్లో రాజ్యమేలుతున్నాయని ఆయన అన్నారు. ఎన్ని జన్మలెత్తిన ప్రజల రుణం తీర్చుకోలేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి గుండెలోనూ బతికి ఉన్నారని ఆయన అన్నారు.
ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు కలిగినా రాజకీయాల్లో మడమ తిప్పకూడదని వైయస్ నేర్పారని, మాటలూ చేతలూ ద్వారా ప్రజల విశ్వసనీయతను పొందాలని నేర్పారని ఆయన అన్నారు. రాష్ట్రానికే కాదు, దేశానికే ఆదర్శంగా వైయస్ నిలిచారని ఆయన అన్నారు. మరణించిన తర్వాత ఎంత మంది గుండెల్లో నిలిచి ఉన్నామనేదే ప్రధానమని వైయస్ చెబుతుండేవారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications