అధిష్టానానికి హెచ్చరిక: నెల్లూరులో వైయస్ జగన్ బలప్రదర్శన

YS Jagan
నెల్లూరు‌: నెల్లూరులో ఆదివారం జరిగిన కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభ పార్టీ అధిష్టానానికి హెచ్చరికగానే భావిస్తున్నారు. దాదాపు 63 రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓదార్పు యాత్ర నిర్వహించిన జగన్ అధిష్టానంపై గానీ పార్టీ నాయకులపై గానీ విమర్శలేమీ చేయలేదు. ఆయన ప్రసంగాలు రోటీన్ గా సాగుతున్నట్లు అనిపించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఓదార్పు యాత్ర పట్ల మీడియా కొంత ఉదాసీనంగా కూడా వ్యవహరించింది. తన వర్గానికి చెందిన నాయకులపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) చర్యలు తీసుకున్నా పల్లెత్తు మాటా అనలేదు. అంబటి రాంబాబు మాత్రమే పార్టీ అధిష్టానంపై, పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రి రోశయ్యపై వాగ్బాణాలు సంధిస్తూ వచ్చారు. ఇంత కాలం మౌనంగా ఉన్న జగన్ నెల్లూరు సభలో మాత్రం తన అంతరంగాన్ని బయటపెట్టుకున్నారు.

నెల్లూరులో శక్తులన్నీ మోహరించి జగన్ వర్గం బలప్రదర్శనకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలు హాజరయ్యారు. జగన్ వర్గానికి చెందిన నాయకులంతా అక్కడ మోహరించారు. కొత్తగా లక్ష్మీపార్వతి, రోజా వచ్చి చేరారు. జగన్ తప్ప మరో నాయకుడు లేడంటూ రోజాతో సహా మిగతా నాయకులంతా ఎలుగెత్తి చాటారు. వైయస్ జగన్ మామూలుగా కాకుండా కాస్తా కటువుగా మాట్లాడారు. ప్రతిపక్షాలను, తన వ్యతిరేక మీడియాను వదిలేసి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. తనను ఒంటరి చేయడానికి పార్టీలో కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, హెచ్చరికలు కూడా చేశారు. సహనం కోల్పోయినప్పుడు ఉప్పెన పుడుతుందని ఆయన హెచ్చరించారు. ఇది పార్టీ అధిష్టానానికి హెచ్చరిక పంపడమేనని భావిస్తున్నారు.

పార్టీ అధిష్టానం తనను అంగీకరించే స్థితిలో లేదని తెలిసినా తనను కాదంటే ఎదురయ్యే పరిస్థితి ఏమిటో ఆయన పరోక్షంగా వినిపించదలుచుకున్నారు. అందుకే అలా మాట్లాడారని భావిస్తున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ చాలా స్పష్టంగానే ఉన్నారని అంటున్నారు. పార్టీ పెట్టేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+