జగన్ చుట్టూ ముగ్గురు ఐరన్ లెగ్గులు ఉన్నారు: సోమిరెడ్డి

రోజా, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ లు వైయస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన చనిపోయారని గుర్తు చేశారు. నల్లపురెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలిసిన వారం రోజుల్లోనే ఆయన మరణించారన్నారు. అప్పటి వరకు ఎదురులేని మనిషిగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన పక్కన లక్ష్మీపార్వతి చేరగానే మృతిచెందారన్నారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు శనిలా దాపురించిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు వారు ముగ్గురు కలిసి ఏకంగా వైయస్ జగన్ పక్కన చేరారని ఆయన అన్నారు.
వైయస్ జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే సహనం నశిస్తే ఉప్పెన వస్తుందని అంటున్నారన్నారు. ఇప్పటికే తన అనుయాయులతో అధిష్టానాన్ని హెచ్చరిస్తున్న జగన్ ఇప్పుడు తాను అధిష్టానాన్ని రెచ్చగొట్టి బయటకు అధిష్టానమే తనను వెళ్లగొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడానికే జగన్ ఇలాంటి వాక్యలు చేస్తున్నాడని సోమిరెడ్డి అన్నాడు. మంత్రులు దానం నాగేందర్, రఘువీరారెడ్డిలు ప్రజా సమస్యలు మరిచిపోయి కేవలం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించడానికే తమ సమాయన్నీ కేటాయిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications