జగన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి: కోటంరెడ్డి

YS Jagan
నెల్లూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరి కాదని ఆయనకు అశేష ప్రజల మద్ధతు ఉందని నెల్లూరు కాంగ్రెసు పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధిష్టానం ఇప్పటికైనా జగన్ కు ఉన్న ప్రజా మద్దతు తెలుసుకొని ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను ఏఐసిసిలో పెట్టనందుకు పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. నెల్లూరు నెల్లూరులో జరిగిన ఓదార్పులో పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారని, దాంతో ప్రజలలో జగన్ ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుందని, దానిని అధిష్టానం అర్థం చేసుకొని నాయకత్వ బాధ్యతలను అప్పగించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+