బరాక్ ఒబామా ప్రసంగానికి ముస్తాబైన భారత పార్లమెంటు

పార్లమెంటు సెంట్రల్ హాలుకు ఒబామా వచ్చిన సమయంలో ఎంపీలందరూ హుందాగా వ్యవహరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా కోరింది. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీల నేతలకు ప్రత్యేక సందేశాన్ని పంపించారు. 2000 సంవత్సరంలో క్లింటన్ వచ్చిన సమయంలో పలువురు ఎంపీలు ఆయనతో కరచాలనం చేయటానికి బెంచీల మీద నుంచి దూకటం, ఒకరినొకరు నెట్టుకోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ దృశ్యాలున్న వీడియో క్లిప్పింగ్‌లను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిలకించారు. హుందాగా వ్యవహరించాలని ఎంపీలకు సూచించటానికి ఆమె నిరాకరించారు. అయినప్పటికీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ముందుజాగ్రత్తగా ప్రత్యేక సూచనలు జారీ అయ్యాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరిగే సమావేశాల్లో 23 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. వీటిలో మహిళా రిజర్వేషన్, విద్యా ట్రైబ్యునళ్లు, పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపు, భూ ఆక్రమణ బిల్లులు ప్రధానమైనవి.












Click it and Unblock the Notifications