హైకోర్టు బెంచ్ కోసం మూడు జిల్లాల్లో సీమాంధ్ర లాయర్ల బంద్

Seemandhra Lawyers
విజయవాడ: గుంటూరు-విజయవాడ మధ్య హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న న్యాయవాదులు సోమవారం గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో కూడా బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ తుపాను కారణంగా ఇక్కడ న్యాయవాదులు ఆందోళనలను వాయిదా వేశారు. న్యాయవాదుల బంద్ కు మద్దతుగా విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. హైకోర్టు బెంచ్ అడుతుంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే దాకా ఆగాలని అనడంలో అర్థం లేదని సీమాంధ్ర లాయర్లు అంటున్నారు. సీమాంధ్ర నాయకుల బంద్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు.

విజయవాడ-గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలంటూ కోస్తా జిల్లాల్లో నిర్వహిస్తున్న న్యాయవాదుల బంద్‌ కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. విజయవాడలో ఉదయం న్యాయవాదులు విద్యాధరపురం, గవర్నర్ ‌పేట డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం నెహ్రు బస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టి ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వకార్యాలయాలను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయవాదుల బంద్‌తో నగరంలో సిటీబస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు నందిగామలో జాతీయరహదారిపై న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హైకోర్టు బెంచ్‌ కోసం తాము నెల రోజులకుపైగా ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+