కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మేం ఒత్తిడి తేలేదు: బరాక్ ఒబామా

అమెరికా ఉద్యోగాలను భారతీయులు దొంగలించలేదని, వేగవంతమైన అభివృద్ధికి భారత్ తోడ్పడిందని మన్మోహన్ సింగ్ అన్నారు. అమెరికా నుంచి ఉన్నత సాంకేతిర పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అన్ని రంగాల్లో అమెరికా, భారత్ ల మధ్య పరస్పరం సహకారానికి అవకాశాలున్నాయని తాము గుర్తించామని ఆయన చెప్పారు. సమాన హోదా గల దేశాలుగా కలిసి పనిచేయాలని అమెరికా, భారత్ లు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అణు, రక్షణ రంగాల్లో పరస్పరం సహకరించుకుంటామని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఆయన చెప్పారు. రక్షణ, సివిల్ రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటాయని ఆయన అన్నారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి, ప్రపంచ శాంతికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీపై ఆంక్షలు తొలిగించినందుకు ఆయన అమెరికాకు అభినందనలు తెలిపారు.
భారత ఆతిథ్యంతో తాము ముగ్ధుడినయ్యానని ఒబామా చెప్పారు. భారత్ కు రావడం తనకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. టెర్రరిజం, వాతావరణ మార్పులపై భారత సహకారం అత్యంత కీలకమని ఆయన అన్నారు. భారత, అమెరికా సంబంధాలను మెరుగు పరుచుకోవడానికే తాను భారత్ వచ్చానని ఆయన అన్నారు. తీవ్రవాదాన్ని తాము తరిమి కొడతామని ఆయన చెప్పారు. భారత్ కు తాము అన్ని విధాలుగా ప్రాధాన్యం ఇస్తామని, భారత్ ప్రగతిని తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. యాంటీలిస్టు నుంచి భారత కంపెనీలను తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications