వైయస్ అభిమానిగా ఉండటమే తప్పా!: సోనియాకు జగన్ వర్గం కొండా ప్రశ్న

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉండటమే తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ చేవిరెడ్డి చేసిన తప్పా అని ఆమె తన లేఖలో ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానునులకు ఉద్దేశ్యపూర్వరంగా కాంగ్రెసు నుండి గెంటి వేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజాబలం ఉన్న నేతను తొలగించడమేమిటని ఆమె అన్నారు. ఉప ఎన్నికల సమయంలో నిజామాబాద్ లో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ పోటీ చేస్తే ఓటమి పాలవుతాడని చెప్పిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు పోటీ చేయవద్దని మధుయాష్కీ అన్నారన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో విధిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉండాలని అమె సోనియాను కోరారు. లేదంటే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఏమయిందో గుర్తుంచుకోవాలన్నారు. పిసిసి, ప్రభుత్వ సమావేశాల్లో వైయస్ ఫోటో ఉండాలని ఆమె అన్నారు. 125 కాంగ్రెసు చరిత్రలో పిసిసి నియంతలా వ్యవహరిస్తోంది. కాంగ్రెసు సీనియర్ నాయకులు కొందరు బహిరంగంగానే గవర్నర్ ను కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. వారిపై పిసిసి చర్యలు తీసుకోలేదన్నారు. పిసిసికి ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేదన్నారు.












Click it and Unblock the Notifications