కోమటిరెడ్డి వెంకటరెడ్డితో దామోదర్ రెడ్డి వైయస్సార్ కయ్యం

వైయస్ ప్రస్థావన ఎందుకని ప్రశ్నించారు. మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 'నేను మంత్రిని ఆయన గురించి మాట్లాడతా..నీవెవ్వరూ' అన్నారు. వైఎస్ సేవలు కొనసాగిస్తూనే రోశయ్య కూడా ఆయన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇంతలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రిని, దామోదర్‌రెడ్డిని సముదాయించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తున్న వైఎస్ అభిమానులను ఏమీ అనవద్దని మంత్రి పోలీసులకు సూచించడంతో సమస్య సద్దుమణిగింది. కాగా, వైయస్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని, ఎన్నికల సమయంలో సీమాంధ్రలో వైయస్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే వీసాలు తీసుకోవాల్సి వస్తుందని ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టారని దామోదర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.
'తెలంగాణ మేమే తెస్తాం. తెలంగాణ తెచ్చే వరకు నిద్రపోం. ఎవరూ ప్రాణత్యాగాలు చేసుకోవద్దు.సోనియా తెలంగాణను ఏనాడో ఇచ్చింది. కేంద్రం ప్రకటించింది. సీమాంధ్రనేతల కుట్రలతో ప్రక్రియ ఆగింది. శ్రీకృష్ణ కమిటీ అనుకూలంగా నివేదిక ఇస్తుందని ఆశిస్తున్నాం.ఇవ్వకపోతే మేమే రాజీనామాలు చేస్తాం' అని తెలంగాణ కాంగ్రెసు నేతలు, ప్రజాప్రతినిధులు భువనగిరి వేదిక ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చారు. సీడబ్ల్యూసీ సభ్యుడు కేశవరావు మాట్లాడుతూ..రాష్ట్రం సాధించేందుకు కంకణ బద్దులమై ఉన్నామన్నారు. తెలంగాణ కోసం కలిసివచ్చే అన్ని పార్టీలతో ఏకమై పోరాటాన్ని కొనసాగిస్తాం.. ఈ పోరాటంలో కేసీఆర్, గద్దర్, తెదేపాను కూడా ఆహ్వానిస్తామన్నారు. ఉద్యమ ఉద్ధృతి తగ్గిందన్న సీఎం రోశయ్య వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణ కేసీఆర్ చేతుల్లో లేదని రాజ్యసభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లిందని గుర్తించి నేతలు అటూ ఇటూ మాట్లాడకుండా ఒళ్లుదగ్గర ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు.ఎంపీల కన్వీనర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పొలవరం గురించి మాట్లాడితే.. దేశద్రోహులుఅంటున్నారని.. పార్టీ, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్రోహం కాదా అని సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు.ఐటీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్రం సాధిస్తామన్న విశ్వాసంతోనే ఈ పదవుల్లో కొనసాగుతున్నామన్నారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా..ముందు కేకే ఆతర్వాత తాము అన్ని పదవులు వదులుకుంటామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధించి తీరుతామని మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీలు వివేక్, బలరాంనాయక్, రాజయ్య, మందా జగన్నాథం, జడ్పీ ఛైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రభుత్వ ఛీప్‌విప్ భారతీరాగ్యానాయక్‌తో పాటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న 25 మందికి రూ.లక్ష చొప్పున వారి కుటుంబాలకు అందించారు.
తెలంగాణ సాధనకు యువకులు ఆత్మహత్యలకు పాల్పడరాదని, బీబీనగర్‌లోని నిమ్స్‌ను ఆధునిక వైద్య సదుపాయం కలిపించి వెంటనే ప్రారంభించాలని, దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను నిలిపేసి ఆ నిధులను జిల్లాలోని ఎస్సెల్బీసీ, ఎస్సారెస్పీ ప్రాజెక్టులకు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ఎంపీ.రాజగోపాల్‌రెడ్డి తీర్మానాలను ప్రవేశపెట్టారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీను ఆర్‌ఎస్‌ఎస్ నేత సుదర్శన్ చేసి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ మందా జగన్నాథం మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications