ఒరిస్సాలో మావోయిస్టు నేత రామకృష్ణ భార్య పద్మ అరెస్టు

Padma
హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ (ఆర్కే) భార్య పద్మను ఒరిస్సా పోలీసులు అరెస్టు చేశారు. భర్తను చూసేందుకు వచ్చి ఆమె ఒరిస్సాలో పట్టుబడి నట్లు ప్రకటించారు. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని సిమిలిగూడ బ్లాక్‌ దుదాలి వద్ద పద్మ అలియాస్‌ శిరీష అలియాస్‌ నిర్మలను అరెస్టు చేసినట్లు దక్షిణ పశ్చిమాంచల డీఐజీ సౌమేంద్ర ప్రియదర్శి ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆమెతోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు అండులూరి ఈశ్వరి (విశాఖపట్నం), సరిత అలియాస్‌ సునీత అలియాస్‌ పూణి మణింగిలను అరెస్టు చేసినట్లు చెప్పారు.

ఈ ప్రాంతం వారం రోజుల్లో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పద్మపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డును ప్రకటించిందని తెలిపారు. ఈశ్వరి గతంలో విశాఖ డివిజన్‌లో పనిచేశారని, ప్రస్తుతం ఆమె కేంద్ర కమిటీకి పదోన్నతి పొందినట్లు తెలిపారు. ఆర్కే ప్రస్తుతం ఒరిస్సాలోని నారాయణ పట్నం ప్రాంతంలో ఉన్నట్లు చెప్పారు. అరెస్టయిన వారి నుంచి విలువైన పత్రాలు, దాడులకు సంబంధించిన వ్యూహరచనల చిత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సౌమేంద్ర వివరించారు.

వైరల్‌ జ్వరంలో బాధపడుతున్న తన భర్త ఆర్కేను కలిసేందుకు వెళుతున్న సమయంలోనే పద్మను ఒరిస్సా పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామకృష్ణ కొద్దిరోజులుగా వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని వెంట తీసుకొని భర్తను చూసేందుకు ఒరిస్సా వెళ్లిన పద్మను కోరాపుట్‌ జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. పద్మపై ఉన్న కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరందరినీ అరెస్టు చేసినట్లుగా ఆదివారం ప్రకటించగా అంతకు నాలుగు రోజుల ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+