కేశవరావు బ్లాక్ మెయిలర్, అది సిగ్గుచేటు: కావూరి

Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై జరిగిన గొడవలో తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావుపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు దుమ్మెత్తిపోశారు. కేశవరావు బ్లాక్ మెయిలర్ అని, అటువంటి వ్యక్తి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో ఉండడం అవమానకరమని. అది దేశదౌర్భాగ్యమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన మాటలను కేశవరావు వక్రీకరించారని, అందువల్ల క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఏనాడూ గిరిజనులకు సేవ చేయనివారు వారి పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన అన్నారు.

వర్గాలు, కులలా పేరుతో అవాస్తవాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కేశవరావు ఏ ప్రజల వద్దకు వెళ్లారని, పైగా చదువుకున్నారనీ మేధావి అని పేరు అని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయనివారు సిడబ్ల్యుసిలో ఉండడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. గిరిజనులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం వారికి అలవాటు అని ఆయన అన్నారు. పోలవరం ద్వారా భూములు కోల్పోయినవారికి వేరే చోట ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తున్నారని మాత్రమే తాను అన్నానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+