23న హైదరాబాద్ ముట్టడికి సిద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఇంటి అద్దె భత్యం పెంపు, ఉపాధ్యాయుల అప్రెంటీస్ విధానం రద్దు, ప్రత్యేక విద్యా వాలంటీర్ల సర్వీసు క్రమబద్ధీకరణ వంటి అంశాలపై మంత్రుల బృందం ఏమాత్రం పట్టించుకోలేదని వారు ఆక్షేపిస్తున్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయటంలో భాగంగానే ఈ నెల 23న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఆరోజు కనీసంగా 3 లక్షల మంది ఉద్యోగులు రాజధానికి తరలి వస్తారని వారి అంచనా. ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రధాని మన్మోహన్, యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ దృష్టికీ తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఏదో ఒక సమ్మె రూపాన్ని ఎంచుకోక తప్పదని వారు చెబుతున్నారు. వేతన సవరణ సమస్యలు మినహా ప్రధాన సమస్యలేవీ ప్రభుత్వం పరిష్కరించలేదన్న భావన ఉద్యోగుల్లో ఏర్పడింది.












Click it and Unblock the Notifications