ఫ్రీజోన్ అంశం తేలితేన తర్వాతే: సబితారెడ్డిని కోరిన కోదండరామ్

ఫ్రీజోన్ అంశం నేపథ్యంలోగానీ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యాగానీ, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యాగానీ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం మొండివైఖరితో పరీక్ష నిర్వహించినా అది కోర్టుకు వెళుతుందని అప్పుడు ప్రభుత్వం చేతులత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఫ్రీజోన్ విషయమై ఇద్దరు అధికారులను నియమించాలని ఆయన మంత్రిని కోరారు. మరో ఇద్దరు ఎంపీలను ఎన్నుకొని కేంద్రంపై ఒత్తిడి చేయటానికి సమస్యను అప్పగించాలని కోరారు.
అయితే హోంమంత్రి సబితారెడ్డి తన డిమాండ్లపై ఒకరోజు సమయం అడిగినట్టు చెప్పారు. విద్యార్థులతో కూడా మంత్రి మాట్లాడటానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆమె నుండి సానుకూల స్పందన వచ్చిందని అయితే ఖచ్చితమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సబితారెడ్డితో మళ్లీ సమావేశమయ్యే ఆలోచనలు ఆమె ప్రతిస్పందన తర్వాత నిర్ణయించుకుంటామన్నారు. ఆ తర్వాత కార్యాచరణ కూడా రూపొందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications