రామోజీ రావుకు కెసిఆర్, రోశయ్య చేయూత: మార్గదర్శి విస్తరణ

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ముఖ్య అనుచరుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీ రావు మార్గదర్శి ఫైనాన్స్ పై యుద్ధం చేశారు. ఆ సమయంలో మార్దదర్శి మూత పడుతుందా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. రామోజీపై తాను ప్రకటించిన యుద్ధాన్ని ఉండవల్లి విరమించుకున్నట్లే కనిపిస్తున్నారు. ఈ స్థితిలో మార్గదర్శిని రామోజీ రావు విస్తరించే పరిస్థితి వచ్చింది. రామోజీరావు ప్రధాన సమరం తనకు పోటీదారు అయిన వైయస్ జగన్ మీదనే, ఇంతకు ముందు వైయస్ రాజశేఖర రెడ్డి మీదనే. దాంతో తన వ్యాపార ప్రయోజనాల కోసం రామోజీ రోశయ్యతో చేతులు కలిపినట్లు భావిస్తున్నారు.
కాగా, కెసిఆర్ మొదటి నుంచి ఏదో మేరకు రామోజీ రావుకు అనుకూలంగానే ఉన్నారు. ఎన్నికల్లో చంద్రబాబును, కెసిఆర్ ను కలిపింది కూడా రామోజీరావేనని అంటారు. వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు పార్టీని ఓడించడానికి వారిద్దరిని రామోజీ కలిపారని అంటారు. అయితే, ఆయన ప్రయత్నం ఫలించలేదు. రెండోసారి వైయస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీ మరింతగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. వైయస్ మరణంతో ఆయనకు కొంత ఊరట కలిగిందనే చెప్పాలి. దాంతో తన వ్యాపారాలను విస్తరించుకోవడానికి రామోజీ అడుగులు వేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications