స్సెక్ట్రమ్ పై ప్రధాని మన్మోహన్ సింగ్ కు సుప్రీంకోర్టు అక్షింతలు

"నిష్పక్షపాత, సుపరిపాలన కలిగిన ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్దేశించిన మూణ్నెల్ల గడువులోగా అనుమతి మంజూరుచేయడం సాధ్యమే. ఇప్పటికే 16 నెలలు గడిచిపోయింది. అనుమతి ఇవ్వడం నాకు ఇష్టంలేదని సంబంధిత అథారిటీ చెప్పొచ్చు. సానుకూలంగానో, వ్యతిరేకంగానో స్పందించొచ్చు. కానీ నిష్క్రియ, మౌనం అనేవి ఇబ్బందికరంగా మారాయని మేం ఇక్కడ గమనించాం" అని కోర్టు చురకలంటించింది. సుబ్రమణ్యంస్వామి నుంచి ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా సంబంధిత అథారిటీ(ప్రధాని) చర్యలు ప్రారంభించి ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని హవాలా వ్యవహారానికి సంబంధించిన వినీత్ నారాయణ్ కేసు తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్న విషయాన్ని న్యాయమూర్తులు గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications