కాంగ్రెసు వర్సెస్ వైయస్ జగన్ : పార్టీ అధిష్టానం సీరియస్

సాక్షిని నిషేధించాలని శంకరరావు డిమాండ్ చేశారు. సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం ఇచ్చినందుకు 24 గంటలలోగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే సాక్షి కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కూడా అన్నారు. వైయస్ జగన్ అహంభావానికి ఆ వార్తాకథనం నిదర్శనమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైయస్ జగన్ పై పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వైయస్ జగన్ సాధ్యమైనంత తొందరగా పార్టీని విడిచిపెట్టి, సొంత పార్టీ పెట్టే ఉద్దేశంతోనే సోనియాపై ప్రత్యక్ష పోరుకు దిగారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దానికితోడు, అధిష్టానం నాడిని పట్టుకోవడానికి ఆయన ఈ వార్తాకథనం ద్వారా ప్రయత్నించారా అనే సందేహం కూడా కలుగుతోంది. అయితే, ఇంత దాకా వచ్చిన తర్వాత వైయస్ జగన్ ను పార్టీ అధిష్టానం సహించబోదనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications