ఫ్యాక్షనిస్టుకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు: ఎమ్మెల్యే శంకరరావు

2004కు ముందు జగన్ ఎక్కడున్నాడని ఆయన ప్రశ్నించారు. జగన్ సాక్షి పెట్టుబడులపై సిబిఐ విచారణ కోరుతామని ఆయన అన్నారు. వైయస్ రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 30 సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయితే 2004లో ఇందిరమ్మ పాలన తెస్తాం, రాజీవ్ గాంధీలా పరిపాలిస్తాం అని వైయస్ చెప్పటం వల్ల ప్రజలు ఓటు వేసి గెలిపించారని ఆయన అన్నారు. దురుద్దేశంతో కథనాలు ప్రసారం చేసిన సాక్షిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై యావద్దేశం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారన్నారు. సాక్షి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న శంకరరావులు పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కెఎం ప్రతాప్ కూడా సాక్షి కార్యాలయం ముందు ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications