ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తోంది: చంద్రబాబు నాయుడు

మహారాష్ట్రంలో ఆదర్శ్, కామన్వెల్తు, తాజాగా 2జి స్పెక్ట్రంలో రాజా కరప్షన్ కాంగ్రెసు అవినీతికి అద్దం పడుతుందన్నారు. పార్టీ ఫండ్ పేరుతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 22 రోజులుగా బీడీ కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వర్గపోరుతోనే సమయం గడిచిపోతుందన్నారు.
కాగా మంళవారం చంద్రబాబునాయుడు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. ఉభయ సభలను కుదిపేసిన కరప్షన్ కింగ్ రాజా పాల్పడ్డ 2జి స్పెక్ట్రంపై విపక్షాలతో చర్చించేందుకు వెళ్లనున్నారు. జాతీయ పార్టీలతో ఆయన ఈ అవినీతిపై చర్చించనున్నారు. యనమల రామకృష్ణుడు, ఎర్రంనాయుడు, దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు కూడా వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications