సాక్షిపై భగ్గుమన్న కాంగ్రెసు శ్రేణులు: వైయస్ జగన్ పోటీ ఆందోళనలు

సాక్షికి మద్దతుగా నెల్లూరు, ఒంగోలు, చీరాల, అనంతపురం జిల్లా కదిరి తదితర చోట్ల జగన్ వర్గీయులు ర్యాలీలు నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో జగన్ మద్దతుదారులుగా చెబుతున్న కొందరు విద్యార్థులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. దాంతో ఉత్తరాంధ్ర విద్యార్థిసేన సోనియా పటానికి క్షీరాభిషేకం జరిపింది. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా జగన్‌ను బాధ్యులుగా చూపుతూ రాజకీయ లబ్ధి పొందేందుకు సీనియర్లు ప్రయత్నిస్తున్నారని గుంటూరు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అధిష్ఠానానికి, జగన్‌కు మధ్య అంతరాలు పెంచేందుకు కేకే, వీహెచ్, సర్వే వంటి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ను ఒంటరి చేసేందుకు పార్టీలోని కొందరు సీనియర్లు కుయుక్తులు పన్నుతున్నారని పీసీసీ మాజీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరులో విమర్శించారు.












Click it and Unblock the Notifications