యెడ్యూరప్పకు ఎలాంటి డెడ్ లైన్లు లేవు: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పకు పార్టీ అధిష్టానం ఎలాంటి డెడ్ లైన్లు పెట్టలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముప్పవరపు వెంకయ్యనాయుడు విలేకరులతో మంగళవారం అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా యెడ్యూరప్ప చెప్పారని ఆయన అన్నారు.

కర్ణాటక సంక్షోభం త్వరలో సమసిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తనను రాజీనామా చేయాలని కోరినందున యెడ్యూరప్ప కూడా తమకు ఎలాంటి షరతులు విధించలేదని చెప్పారు. ఆయన మొదటి నుండి అధిష్టానానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారన్నారు. తను సూచించిన వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, గాలి సోదరులను మంత్రివర్గం నుండి తప్పించాలని యెడ్యూరప్ప షరతులు విధించినట్టు చెబుతున్న వార్తల్లో నిజం లేదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన ఢిల్లీకి వచ్చారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+