మిషన్ వైయస్ జగన్: స్క్రీప్టుతో సిఎల్పీ భేటీకి వీరప్ప మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చర్యకు మిషన్ ప్రారంభమైనట్లే. మంగళవారం ముఖ్యమంత్రి కె. రోశయ్య ఢిల్లీ యాత్ర పూర్తిగా రాజకీయపరంగానే సాగింది. వైయస్ జగన్ పై చర్యకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి అనుగుణంగా సాగింది. అందులో భాగంగానే హడావిడిగా కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఏర్పాటైంది. ముఖ్యమంత్రి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సిఎల్పీ అత్యవసర సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శాసనసభ్యులకు అందించారు. ఈ సమావేశానికి శాసనసభ్యులనే కాకుండా ఎమ్మెల్సీలను, పార్టీ పార్లమెంటు సభ్యులను ఆహ్వానించారు.

వైయస్ జగన్ పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తాకథనంపై కూడా చర్చ జరుగుతుంది. అధిష్టానం అందించిన పక్కా స్క్రిప్టుతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వైయస్ జగన్ పై చర్య తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ ఈ సమావేశంలో ఓ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి దినపత్రిక వార్తాకథనాన్ని ఖండిస్తూ మరో తీర్మానం కూడా చేసే అవకాశం ఉంది. దీంతో వైయస్ జగన్ పై చర్యకు తగిన ప్రాతిపదిక ఏర్పాటు చేస్తున్నారు.

మంగళవారం రోశయ్య పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోనీకి వైయస్ జగన్ వ్యవహారంపై 60 పేజీల నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. అదే ప్రతిని ఆయన సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. సిఎల్పీ సమావేశంలో వైయస్ జగన్ కు అనుకూలంగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వ్యవహారాలు నడిపిన శాసనసభ్యులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో శాసనసభ్యుల మనోగతాన్ని కూడా అంచనా వేస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+