రంగంలోకి గులాం నబీ ఆజాద్: సిఎల్పీ సమావేశానికి హాజరు

గతంలో ఆజాద్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరించారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పార్టీకి పొత్తు కుదిర్చింది కూడా ఆయనే. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకపోయినా తెరాసతో ఆయన పొత్తు కుదిర్చారు. పొత్తులు కుదర్చడంలోనూ పరిస్థితులను అంచనా వేయడంలోనూ ఆజాద్ ది అందె వేసిన చేయి అంటారు. అందుకే ఆజాద్ ను ప్రత్యేకంగా పిలిపించి హైదరాబాద్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇంత వరకు తెర వెనక ఉండిపోయిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెర మీదికి వచ్చారు. తెలంగాణ సీనియర్ నాయకులు రోశయ్య రాజీనామా చేస్తున్నట్లు వార్త వచ్చిన వెంటనే హైదరాబాదులో డిఎస్ ను కలుసుకున్నారు. అంతకు ముందు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రోశయ్య రాజీనామా చేయడం బాధాకరమని మంత్రి జె. గీతారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications