ముఖ్యమంత్రి పదవి వద్దంటున్న జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు

ముఖ్యమంత్రి చేపట్టడానికి ముందుకు రావాలని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు జైపాల్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని వినికిడి. మీరు ముఖ్యమంత్రిగా వెళ్తే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని వారు జైపాల్ రెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ పార్లమెంటు సభ్యులు మాత్రం ముఖ్యమంత్రిని ఎవరిని చేసినా తమకు అభ్యంతరం లేదని, అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గకూడదని తెలంగాణ పార్లమెంటు సభ్యులు వాదిస్తున్నారు. ఈ స్థితిలో జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పదని అంటూనే తన పేరు ముఖ్యమంత్రి పదవికి పరిశీలనలో లేదని, తనకు ఆ విషయం ఎవరూ చెప్పలేదని జైపాల్ రెడ్డి మీడియాతో అన్నారు. తెలంగాణ సమస్యను, వైయస్ జగన్ వ్యవహారాన్ని చక్కదిద్దాలని మాత్రమే చెప్తే సరిపోదని, వాటిని ఎలా చక్కదిద్దాలో స్పష్టమైన విధానాన్ని తెలిపితే తాను ముఖ్యమంత్రిగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని జైపాల్ రెడ్డి ప్రణబ్ తో చెప్పినట్లు సమాచారం. తాను ఏవో నిర్ణయాలు చేసి, సమస్యలు ఎదురైతే తాను బరువు మోయాల్సిన పరిస్థితి ఉండకూదనేది జైపాల్ రెడ్డి అభిప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications