ముఖ్యమంత్రిగా జానారెడ్డిని ప్రతిపాదించిన జైపాల్ రెడ్డి

జైపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదవిని వద్దని చెబుతున్నట్టు సమాచారం. డిసెంబర్ 31న తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను కేంద్రానికి ఇవ్వనున్నందున అప్పుడు భారీ ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశముందని అలాంటప్పుడు తాను ముఖ్యమంత్రిగా కూర్చుంటే సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుత కేంద్రమంత్రి పదవి ఆయనకు ప్రశాంతంగా ఉంది.
కాగా న్యూఢిల్లీలో పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్లో జానారెడ్డి ఇంట్లో కూడా తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. అయితే జానారెడ్డి, జైపాల్ రెడ్డిలు కాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరిస్తే గీతారెడ్డికి ఉపముఖ్యమంత్రి పదవి, బొత్స సత్యానారాయణకు పిసిసి అధ్యక్షుడి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో గీతారెడ్డికి సిఎం పోస్టు ఇస్తే ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా కొట్టివేయలేము.












Click it and Unblock the Notifications