ముఖ్యమంత్రి పదవికి వైయస్ విజయలక్ష్మి పేరును ప్రతిపాదిస్తారా?

YS Vijayamma
హైదరాబాద్: అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి పేరును ప్రతిపాదించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం ఉన్నట్లు ప్రచారమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి నివాసంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమై తాము సిఎల్పీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత వారంతా సిఎల్పీ సమావేశంలో పాల్గొనడానికి శాసనసభకు వచ్చారు.

వైయస్ జగన్ బాబాయ్, ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి సమావేశానికి హాజరవుతున్నారు. వైయస్ విజయలక్ష్మి మాత్రం హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అయితే వైయస్ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతున్నామని అంటున్నారు. అయితే, వారు తమ వ్యూహాన్ని బయటపెట్టడం లేదని అంటున్నారు. కొత్త నేత ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ సిఎల్పీ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు. అయితే, దానికి వైయస్ జగన్ వర్గం ఏమైనా ఆటంకాలు కలుగజేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+