సిఎల్పీ సమావేశానికి జగన్ డుమ్మా: బెంగళూర్ లోనే మకాం

అయితే, తాజా పరిణామాలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు, తన సన్నిహితులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తనపై పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకున్నా దిగి రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా పార్టీ అధిష్టానానికి పరోక్ష హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం. జగన్ అనుచరుడు గోనె ప్రకాశ రావు మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. వైయస్ జగన్ వ్యక్తి కాదు, శక్తి అని ఆయన అంటూ వైయస్ జగన్ పై చర్యలు తీసుకుంటూ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, కాంగ్రెసుకు బీహార్ లో పరిస్థితి ఎదురవుతుందని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.












Click it and Unblock the Notifications