బాలయ్యబాబు, అజారుద్దీన్ లకు కిరణ్ కుమార్ రెడ్డి మిత్రుడు

కిరణ్ కుమార్ నిజాం కళాశాలలో చదివారు. ఆ సమయంలో చిత్ర నటుడు నందమూరి బాలకృష్ణ కిరణ్ కు సీనియర్. దాంతో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. తరుచూ మాట్లాడుకునేవారు. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ తరచుగా ఇద్దరు కలుసుకుంటుంటారు. ఇక క్రికెటర్ ఆజారుద్దీన్ తోను స్నేహం ఉంది. ఆజారుద్దీన్ తో కలిసి రంజీ మ్యాచ్ లు ఆడారు. అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన అజారుద్దీన్ సైతం కిరణ్ కుమార్ రెడ్డి కెప్టన్సీలో ఆడారు. కనీసం ఓ మూడేళ్లు ఈయన కెప్టేన్సీలో ఆజహర్ ఆడారు.
అందుకే అజారుద్దీన్ తాను రాసిన ఆత్మకథలో మై కెప్టేన్ అనే పేరుతో కిరణ్ కు రెండు పుటలు కేటాయించారు. అంతే కాదు అజర్ రాజకీయాల్లోకి రావటంలో కిరణ్ ప్రోత్సాహం ఉందంట. క్రికెటర్ గా ఎదగాలనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి తన తండ్రి అమరనాధ్ ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించవలసి వచ్చింది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షాబోగ్లే కూడా కిరణ్ కు స్నేహితుడే.












Click it and Unblock the Notifications