చిరంజీవికి నిరాశ: ఉప ముఖ్యమంత్రిగా గీతారెడ్డికి చాన్స్

గీతారెడ్డి పేరుతో పాటు పొన్నాల లక్ష్మయ్యల పేరును కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పరిశీలించే అవకాశాలున్నాయని తెలిసింది. దామోదరం రాజనర్సింహ పేరు కూడా ముందుకు వస్తోంది. 1960లో రాయలసీమకు చెందిన దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తొలిసారిగా తెలంగాణకు చెందిన కేవీ రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. 1980 వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. సీఎంగా ఉన్న వ్యక్తి ఒక ప్రాంతానికి చెందిన వారైతే, ఉప ముఖ్యమంత్రిగా మరో ప్రాంతం వ్యక్తిని నియమించేవారు. 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కోనేరు రంగారావును ఉప ముఖ్యమంత్రిని చేశారు.












Click it and Unblock the Notifications