యువకుడు, బాగా పని చేస్తాడు: కిరణ్ కుమార్ రెడ్డిపై డిఎస్

తామందరమూ సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తున్నామని, ఆమె ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించడాన్ని ఆమోదిస్తామని శాసనసభ్యుడు జోగి రమేశ్ అన్నారు. ఆమె నాయకత్వంలో పని చేస్తున్నప్పుడు ఆమె చెప్పినదానిని ఆమోదించడం మా బాధ్యత అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో 2014లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని మళ్లీ గద్దెనెక్కించే దిశలో కృషి చేస్తామని ఆయన చెప్పారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు కృషి చేస్తామన్నారు.
వైయస్ జగన్ విషయమై విలేకరులు ప్రశ్నించినప్పుడు ఇప్పుడైనా, 2014లోనైనా సోనియా నిర్ణయమే మా నిర్ణయమని ఆయన ప్రకటించారు. అందరూ అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఆదరణ చూరగొంటామన్నారు. ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశ్యంతోనే సోనియా కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications