మంత్రి పదవుల కోసం మహా తంటాలు, ప్రకటనలు

P Shankar Rao
హైదరాబాద్: 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు, మాజీమంత్రి దానం నాగేందర్, కాసు కృష్ణారెడ్డి, రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గల్లా అరుణకుమారిలు చోటు కోసం తమతమ ప్రయత్నాలు చేస్తున్నారు. గల్లా అరుణకుమారి కిరణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం కన్న ముందే కిరణ్ ను కలిశారు. ఆ తర్వాత పితాని సత్యనారాయణ తదితరులు కలిశారు. కాసు కృష్ణారెడ్డి, రఘువీరారెడ్డి, పొన్నాల ఇప్పటికే కిరణ్ యువకుడు బాగా పరిపాలిస్తాడని వ్యాఖ్యానించి ఆయన్ను పొగడటం ద్వారా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయన్ను కలవడానికి శాసనసభ్యులు క్యూ కడుతున్నారు.

మంత్రి దానం నాగేందర్ అయితే ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్ భవన్ వెళ్లే దారిలో స్వాగత ఫ్లెక్సీలు కట్టి తన మనసులోని ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పారు. అక్కడంతా దానం నాగేందర్ ప్రధానంగా ఉన్న ఫ్లెక్సీలే. ఇక అందరికంటే కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు మరో అడుగు ముందుకేసి అధిష్టానం కష్టపడి పనిచేసే వారిని గుర్తిస్తుందని వ్యాఖ్యానించాడు. దివంగత వైయస్ ఆశయమైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి జగన్ కృషి చేస్తారన్నారు. జగన్ను ఇన్నాళ్లూ విమర్శించిన ఆయన జగన్ మంచివాడేనని, అయితే ఆయన వెనుక ఉన్నవారే ఆయనను తప్పుదారిలోకి తీసుకెళుతున్నారన్నారు. 2009 ఎన్నికలలో ఐదుసార్లు గెలిచిన శాసనసభ్యులు పదిమంది ఉన్నారన్నారు. అందులో తానూ ఒకడినని చెప్పారు. దీంతో ఆయన మంత్రివర్గంలో చోటుకోసం సీనియారిటీని ముందుకు తీసుకువచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+