చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరుతారా?

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కొత్త ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరుతారా అనే సందేహం కలుగుతోంది. చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం సుముఖంగానే ఉంది. అయితే, చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పదవిని, ఇద్దరు శాసనసభ్యులకు మంత్రి పదవులను ఆయన ఆశించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగానే ఉండవచ్చు కానీ ఉప ముఖ్యమంత్రి పదవే సమస్యగా మారింది. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పేశారు. దీంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి గల్లంతైనట్లే.

కాగా, తమ పార్టీ వైఖరిని ఖరారు చేసుకోవడానికి చిరంజీవి గురువారం పార్టీ శాసనసభ్యులతో సమావేశమవుతున్నారు. కాంగ్రెసుతో అనుసరించాల్సిన వైఖరిని ఈ సమావేశంలో నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెసు ప్రభుత్వంలో చేరాలా, వద్దా అనే విషయంపై కూడా ఆయన చర్చిస్తారు. కోరితే కాంగ్రెసు ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీలను ఆయన శాసనసభ్యుల ముందు పెట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+