హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాసనసభ స్పీకర్ పదవికి రేసులో మర్రి శశిధర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, ఆనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Marri Sashidhar Reddy
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి ఎంపిక జరగవచ్చునని ప్రచారం జరుగుతోంది. స్పీకర్ గా ఉన్న నలారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంతో స్పీకర్ ఎన్నిక అవసరమైంది. రోశయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి, గాదె వెంకటరెడ్డి పేర్లు కూడా స్పీకర్ పదవికి వినిపిస్తున్నాయి. అయితే మర్రి శశిధర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రెడ్డి కావడంతో స్పీకర్ గా అదే సామాజిక వర్గానికి ఇవ్వడం బాగుండదని భావిస్తే బిసిని ఆ పదవి వరించే అవకాశం ఉంది. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య పేరు ముందుకు రావచ్చు.

కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రాధాన్యతలు, అధిష్ఠానం సూచనలు రెంటినీ పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పును నిర్ణయించనున్నారు. ముఖ్యమంత్రిని మార్చే విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడే అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణపైనా దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం కావడంతో మంత్రివర్గంలో భారీ మార్పులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకూ స్పీకర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడున్న మంత్రుల్లో చాలామందితో సంబంధాలు కలిగి ఉండడంతో కొంతమందిని మాత్రమే మార్చేందుకు అవకాశం ఉందని అంటున్నారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక మంత్రివర్గ కూర్పుపై కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టిసారిస్తారని తెలిసింది. మరోవైపు జగన్‌ వర్గీయులైన మంత్రుల విషయంలో ఆయన ఎలాంటివైఖరి అవలంభిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X