పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఈ పరిణామాలు భారత్ కు గుదిబండగా మారాయి. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను భారీగా పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఒక్కో సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది.
దీంతో ఇక అందరి దృష్టి కూడా పెట్రోల్ రేట్లపై పడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చనే ఊహాగానాలకు తెర లేచింది. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పెరగడం దీనికి మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. యుద్ధం మొదలైనప్పటి నుండీ బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ బ్యారెల్‌కు 10 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ఒక్కటింకి 100.89 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

యూఎస్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో సైతం క్రూడ్ ధర కూడా భారీగా పెరిగింది. ఏకంగా 8.1 శాతం పెరిగి 95.39 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది రికార్డు స్థాయి ధర. ఈ మధ్యకాలంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో ఈ స్థాయిలో ధరల పెరుగుదల చోటు చేసుకోలేదు. ఇది- దేశీయ పెట్రో రేట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే డొమెస్టిక్ వంటగ్యాస్ రేట్లు పెరిగిన నేపథ్యంలో త్వరలో వీటి రేట్లను కూడా కేంద్రం సవరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications