జగన్ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోవద్దు: పాల్వాయి

అధిష్టానానికి వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న జగన్ ను, ఆయన కుటుంబ సభ్యులను వెంటనే పార్టీనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ వర్గీయుల విషయమై ఇప్పటికే అధిష్టానానికి లేఖ రాశానని ఆయన చెప్పారు. తెలంగాణ వారికి ఉపముఖ్యమంత్రి పదవి అనేది చేతికి ఆరోవేలు వంటిదని అన్నారు. తెలంగాణ వారికి ఉపముఖ్యమంత్రి పదవి వద్దని ఆయన చెప్పారు. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications