లోకేష్ ఛానల్లో రాష్ట్రం మరో బీహారవుతుందన్న జగన్ వర్గం నేత గోపాలరెడ్డి

మంత్రివర్గంలో వైఎస్ అనుయాయులకు అవకాశం ఉంటే జగన్ కు సముచిత స్థానం కల్పించినట్లు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మంత్రివర్గాన్ని అట్టిపెట్టి ఉంచినప్పటికీ సముచిత స్థానం కాదన్నారు. కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడైనందున జగన్ కు సముచిత స్థానం కల్పించినట్టేగా అని ప్రశ్నిస్తే రోశయ్య కూడా వైఎస్ కు అంతకన్నా సన్నిహితుడని, ఆయన మంత్రివర్గమంతా వైఎస్ దేనని ఆయన అన్నారు. మాకు పదవుల గురించి బాధ లేదని, ఇప్పుడు కాదు, ఎప్పటికీ మాజీలుగా ఉన్నా బాధపడమని అయితే జగన్ కు సముచిత స్థానం కల్పిస్తేనే బాగుంటుందని ఆయన అన్నారు.
జగన్ కొత్త పార్టీ అనేది కేవలం పుకార్లుగానే ఆయన కొట్టి పారేశారు. జగన్ కొత్త పార్టీ పెట్టాలని ఎన్నడూ అనుకోలేదని ఆయన అన్నారు. అదంతా మీడాయా సృష్టి అని ఆయన అన్నారు. రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వైఎస్ వర్గం అన్నారని, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు జగన్ను అణగదొక్కడానికి అధిష్టానం ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూర్చుండబెట్టిందనే వార్తలను సైతం ఆయన కొట్టి పారేశారు. వైఎస్ తమ్ముడు వివేకానందకు మంత్రి పదవి రావటం అధిష్టానం ఇష్టం, ఆయన ఇష్టం అన్నారు.
జగన్ను అధిష్టానం గుర్తించలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జగన్ను గుర్తించినట్లయితే ఆయన్ను అధిష్టానం కనీసం ఫోన్లో అయినా కలవలేదన్నారు. అంతేకాకుండా జగన్ కు సముచిత స్థానం కల్పించలేదంటున్నరు. రాష్ట రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే జగన్ ను దూరం పెడితే పార్టీకే నష్టమని ఆయన చెప్పారు. కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగన్ పై అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications