తిరుపతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని రిలయెన్సు ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం దర్శించుకున్నారు. అంబానీ వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం ఆయన తిరిగి నేరుగా ముంబయి వెళ్లిపోయారు. ముంబై నుండి ప్రత్యేక విమానంలో నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అంబానీ, రహదారి మార్గం ద్వారా వేంకటేశ్వర సన్నిధికి చేరుకున్నారు. కాగా గతంలో ముఖేష్ అంబానీ తిరుపతి వేంకటేశ్వరునికి ఆలయ స్వర్ణతాపడం కోసం 6కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.