దేవాలయ ప్రాంగణంలోనే భక్తురాలిపై ఆలయ ఉద్యోగుల అత్యాచారం

సెక్యూరిటీ గార్డులు భర్తను గదిలోనే ఉంచి బందించి భార్యపై అత్యాచారయత్నం చేశారు. భర్తను చితకబాదారు కూడా. అయితే అక్కడున్న వేరే భక్తులకు అనుమానం వచ్చి వారిని నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు దొరికారు. వీరిని భక్తులు పట్టుకొని బాగా చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఒకరు పరారీలో ఉన్నారు.
ఆలయ అధికారి ఆ ముగ్గురు ఉద్యోగులైన సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.బాధితరాలు మడకశిర వాసి. కాగా ఈ సంఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈవో హామీ ఇవ్వటంతో భక్తులు శాంతించారు. కాగా నిందితులు ముగ్గురు కాంట్రాక్టు ఎంప్లాయిస్.












Click it and Unblock the Notifications