కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ఏర్పాటుతో తేలిపోతుంది: అంబటి రాంబాబు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వైయస్ జగన్ శిబిరం నడపడం లేదని, కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఇంటి వద్ద సందడి తగ్గిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వైయస్ జగన్ ను సందర్శించడానికి అభిమానులు వస్తూనే ఉంటారని ఆయన అన్నారు. సాక్షి వార్తాకథనాలకు వైయస్ జగన్ ను తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సోనియాకు వ్యతిరేకంగా వైయస్ జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ పై పార్టీ అధిష్టానం చర్య తీసుకుంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications