సోనియా సలహాల మేరకే కేబినెట్: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో బిజీగా గడుపనున్నారు. ఉదయం గం.9.45 నిమిషాలకు గులాం నబీ ఆజాద్ తో భేటీ ఉంది. గం.11.15 నిమిషాలకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీతో భేటీ అవుతారు. 11. 45 నిమిషాలకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమవుతారు. కేంద్ర మంత్రి ఆంటోనీతో మధ్యాహ్నం 12 గంటలకు, కేంద్ర హోం మంత్రి చిదంబరంతో పన్నెండున్నర గంటలకు సమావేశమవుతారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ ఢిల్లీలో లేరు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన సమావేశమై మంత్రి వర్గాన్ని ఖరారు చేయించుకుంటారు. మంత్రివర్గంలో తాను చేర్చుకోదలచినవారి పేర్లతో ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. సోనియా సలహా మేరకు అందులో కొన్ని మార్పులు చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications